తెరవెనుక విజయసాయిరెడ్డి అంత ఘోరం చేశారా….

తెరవెనుక విజయసాయిరెడ్డి అంత ఘోరం చేశారా....

0
91

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న కౌంటర్ ఇచ్చారు… ఇటీవలే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసుకుని చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే… రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల అని ఆరోపించారు.

పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని అయితే ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు… అయితే దీనికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు…

నాన్నకి, తనకి రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచారని. రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయ్ ని బలితీసుకున్నారని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న… ఈ ఘటనలకు తెరవెనుక మంత్రాంగం నడిపింది విజయసాయిరెడ్డేనని బుద్దావెంకన్న ఆరోపించారు…