ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి గారు చాలా రోజుల తరువాత ట్విట్టర్ కు సెలవ ఇచ్చారు, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే విజయ్ సాయి రెడ్డి గారు ఉన్నట్టుండి సెలవా ఇవ్వడం నెటిజన్లకు బాధగా ఉంది అని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం విజయసాయి రెడ్డ్డి గారు ఎక్కడ ? ఈరోజు చంద్రబాబు తప్పులు కనిపించలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఎప్పుడు ట్విట్టర్ న్యూస్ రాసుకునే రచయతలు ఎప్పుడెప్పుడు ట్విట్ పెడుతారా, ఎప్పుడు ప్రజలకు చెపుదామా అని వెయిట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేధికగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటి నుంచి రోజు ఏదొక విషయాన్నీ ట్విట్టర్ సాక్షిగా తీసుకొచ్చే అయన అధికారంలోకి వచ్చినప్పటికీ తగ్గకుండా ట్విట్ చేస్తూ ఉండే అయన ఈరోజు ఎటువంటి ట్విట్ చెయ్యకపోవడం నెటిజన్లకు బాధను కలిపించే విషయమే. ఎప్పుడు చంద్రబాబు చేసిన తప్పులను బయటకు తీసుకొచ్చి విమర్శలు చేస్తూ ప్రజలకు విషయాన్నీ వివరించే విజయసాయి రెడ్డి ఈరోజు చెయ్యకపోవడంతో వెబ్ సైట్ సైతం అయన వార్తలు కనిపించకపోవడం బాధాకరం.
విజయసాయి రెడ్డి గారు ట్విట్ చెయ్యకపోవడంతో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి పుత్రరత్నం, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్స్ సైతం తక్కువ అయ్యాయి. విజయసాయి రెడ్డి గారి ట్విట్స్ లేకపోయేసరికి ఆంధ్ర రాజకీయ ప్రియులకు వార్తలు కరువయ్యాయి. నెటిజన్లతో పాటు ఆన్లైన్ మీడియా రచయతలు విజయ్ సాయి రెడ్డి గారి ట్విట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి గారు గమనించి ట్విట్ చేస్తారు ఏమో చూడాలి.