విజయసాయి రెడ్డి, కన్నాను టార్గెట్ చేయడంవెనుక అంత సీక్రెట్ ఉందా….

విజయసాయి రెడ్డి, కన్నాను టార్గెట్ చేయడంవెనుక అంత సీక్రెట్ ఉందా....

0
102

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది… ఇటీవలే విజయసాయిరెడ్డి కన్నా సుజనాకు 20 కోట్లకు అమ్ముడు పోయారని విమర్శలు చేశారు… దీనికి కన్నా కౌంటర్ కూడా ఇచ్చారు… ఇది పక్కన పెడితే…

కొద్దికాలంగా బీజేపీ వైసీపీ స్నేహంగా ఉంటు వస్తున్నాయి..కేంద్ర ప్రభుత్వంతో సత్సంబాధాలు ఉండేలా వైసీపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతీ సారి బీజేపీ పెద్దలను కలిసి వస్తుంటారు ముఖ్యంగా మోదీ అమిత్ షాలతో జగన్ సానుకూల ధోరణిలో ఉన్నారు… అయితే హఠాత్తుగా కన్నాపై ఎందుకు విమర్శలు చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న…

తొలుత కన్నా వైసీపీ పట్ల సానుకూలంగా ఉండేవారు… గత ఏడాది నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది… కేంద్రం అనుమతి లేకుండా వైసీపీపై కన్నా విమర్శలు చేస్తున్నారని బీజేపీ నాయకులు సైతం అభిప్రాయ పడుతున్నారు… వైసీపీకి కూడా ఇందులో అనేక కారణాలు ఉంటాయి…

చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామాలో భాగంగా కన్నా ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు… కన్నాను ఇలానే వదిలేస్తే.. బీజేపీ, జనసేన, టీడీపీ మైత్రీకి ములం అవుతారని కూడా వైసీపీ భావిస్తోంది.. కన్నా అధ్యక్షుడుగా ఉంటే మూడు పార్టీలు ఏకమవుతాయని వైసీపీ భావిస్తోందట… అందుకే కన్నాను వైసీపీ టార్గెట్ చేసిందని అంటున్నారు…