విజయసాయి రెడ్డికి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందా…

విజయసాయి రెడ్డికి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందా...

0
89

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వెన్నులోవణుకు మొదలైందా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న… ఏడాదిలోపే ఆర్థిక అవినీతి కేసుల విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీం కోర్టు నిర్ణయించడంతో విజయసాయిరెడ్డి వెన్నులోవణుకు మొదలయ్యిందని ఆరోపించారు బుద్దావెంకన్న…

అందుకే న్యాయవ్యవస్థ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు… 11 ఛార్జ్ షీట్లు,లక్ష కోట్ల దోపిడీ, సూట్ కేసు కంపెనీల సూత్రదారి, క్విడ్ ప్రోకో పితామహా 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన విజయసాయిరెడ్డి జగన్ న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడటం వింతగా ఉందని అన్నారు…

లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకి భంగం కలుగుతుందంటూ మీడియాలో కేసు వివరాలు ప్రసారం చేయకుండా గ్యాంగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను కోరిన జగన్ విజయసాయి ఈ రోజు పత్రికా స్వేచ్చ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని బుద్దా వెంకన్న ఆరోపించారు…