విజయసాయిరెడ్డి- నాగబాబు మధ్య కొత్త వివాదం

విజయసాయిరెడ్డి- నాగబాబు మధ్య కొత్త వివాదం

0
91

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే..
టీడీపీ పై జనసేన పై పంచ్ లు వేస్తారు, అయితే తాజాగా జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబుకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.

ఇటీవల విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.. అది చూస్తే

గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు.

దీనికి నాగబాబు మరో ట్వీట్ చేశారు

జీరో విలువ తెలియని వెధవలకి మనం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం వూదినట్టే. ఈ రోజు సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఇంత డెవలప్ అయ్యాయి అంటే సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా అని విమర్శించారు నాగబాబు.