రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వ్యవస్థకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు ఎంపీ విజయాసియిరెడ్డి. డ్వాక్రా ఉత్పత్తులను వాల్ మార్ట్ ద్వారా ప్రపంచమంతా విక్రయిస్తామని కోతలు కోసిన పెద్ద మనిషి సిగ్గుపడేలా జనతా బజార్లు వస్తున్నాయని అన్నారు… పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతాయని తెలిపారు.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అభ్యర్ధనలు వస్తున్నాయని అన్నారు. బహిరంగ మార్కెట్ కంటే సగం ధరకే అందజేస్తుండటం వల్ల భారీగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎక్కడా దీనిని ప్రచారం కోసం వాడుకోవడం లేదని అన్నారు. కరోనా నియంత్రణ ఉత్పత్తులకు ఏపి వాణిజ్య హబ్ అవుతోందని తెలిపారు
ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారని అన్నారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారని తెలిపారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోందని అన్నారు..
ఏం మొహం పెట్టుకుని ఏపీకి వస్తారు మోదీ గో బ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన విషయం ప్రజలిప్పటికీ గుర్తుపెట్టుకున్నారని అన్నారు. వ్యక్తిగత విషయాలపై నీచంగా ఆరోపణలు చేసిన సంగతి మోదీ మర్చిపోయుంటాడని అనుకుంటున్నారు. ఆయనది అపార జ్ఞాపకశక్తి అయినా ప్రజలు తిరస్కరించిన వారిని ఎవరూ ఆదరించరని అన్నారు..