కాంగ్రెస్ నేత విజయ శాంతి చూపు కమలం పార్టీ పై పడిందా అంటే జరిగే పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి .రాబోయే ఉపఎన్నికల్లో దుబ్బాక నియోజక వర్గ విజయం చాలా కీలకం . అందుకే ఇక్కడ తెరాస కి పోటీగా విజయశాంతి పోటీ చేస్తుందని ఇప్పటికే పార్టీ వర్గాలు ప్రకటించాయి . అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారయ్యింది . తాను ఆ నియోజక వర్గం నుండి పోటీ చేయలేదంటూ ఆమె ప్రకటించినట్లు తెలుస్తుంది .
అయితే దీనికి కమలం పార్టీ నేతలే కారణమై ఉంటారని చాల మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .అయితే ఒకప్పుడు బీజేపీ నుండి తెరాస లోకి వెళ్లిన విజయశాంతి ,అక్కడ కూడా మనస్పర్థలతో కాంగ్రెస్ గూటికి చేరింది .అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీ చెంతకే చేరాలని చూస్తుందట .
అయితే తెరాస పై గట్టి పోటీ ఇవ్వడానికి ఆమెను బీజేపీ పార్టీ లోకి ఆహ్వానిస్తుందనీ ,రాజ్యసభ స్థానాల్లో ఆమెకి చోటు కల్పించే ప్రతిపాదన తెచ్చి ఆమెను పార్టీ వైపు మొగ్గేలా బీజేపీ చేసి ఉంటుందనీ చాల మంది రాజకీయ విశ్లేషకుల అంచనా .. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .