విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు – కండిష‌న్స్ ఇవే

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు - కండిష‌న్స్ ఇవే

0
100

దాదాపు 50 రోజులు అవుతోంది లాక్ డౌన్ అమ‌లుచేసి, అయితే కొన్ని స‌డ‌లింపులు ఇస్తోంది ప్ర‌భుత్వం, తాజాగా ఏపీలో కూడా కొన్ని సడ‌లింపులు అయితే ఇస్తోంది స‌ర్కార్. ఈ స‌మ‌యంలో దేవాల‌యాల్లో కూడా భ‌క్తుల‌కి ద‌ర్శ‌నాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, ప్ర‌భుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే అప్పుడు దేవుడి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు..

ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఆల‌యాల‌లో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు, శ్రీకాళ‌హ‌స్తి, తిరుమ‌ల, విజ‌య‌వాడ‌, శ్రీశైలం మ‌హానంది, ఇలా ప‌లు దేవాల‌యాల్లో అక్క‌డ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు, విజ‌య‌వాడ‌లో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
ఇక గుడికి మాస్క్ ధ‌రించి రావాలి, ఆన్ లైన్ ద‌ర్శ‌నం టికెట్లు అమ్ముతారు అవి తీసుకోవాలి.. ఇక ద‌ర్శ‌నానికి సంబంధించి ఎప్పుడు రావాలి అనేది ఎస్ ఎమ్ ఎస్ పంపుతారు మీమొబైల్ కి.

గుడిలో 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేస్తున్నారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం కూడా ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఉంటుంది, ఇక గంట‌కి 250 మందికి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు..అయితే అంతరాలయ దర్శనం శఠగోపం తీర్థం పంపిణి నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.