2024 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంత్….

2024 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంత్....

0
93

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సైరా పంచ్ వేశారు… నావల్లే కరోనా వ్యాక్సిన్ వచ్చింది… నావల్లే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుగొంది… హలో వైజాగ్ పిచ్చాసుపత్రి అండీ అంటూ పోస్ట్ చేశారు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చారు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి…

విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి. కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు. తప్పు ఎవరు చేసిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం. కమిటి ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తారు. అందుకే పారదర్శకంగా నివేదికను జనం ముందుంచారని తెలిపారు…