యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అత్యంత సన్నిహితుడు అమర్ దూబే పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు… ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల హమీర్ పూర్ లో జరిపిన ఎన్ కౌంటర్ లో అమర్ దూబే హతమయ్యాడు… వికాస్ దూబే మరో అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు..
అటు వికాస్ దూబే కోసం పోలీసుల వేట కొనసాగుతోంది… విసృత స్థాయిలో పోలీస్ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నారు… వికాస్ దూబేకు సహకరించిన పోలీసుల పాత్ర బయటకు వస్తోంది… ఎనిమిది మంది పోలీసుల ఎన్ కౌంటర్ విషయంలో స్థానిక పోలీసుల ప్రమేయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది…
ఇప్పుడు దాదాపు 200 మంది పోలీసులు వికాస్ దూబే ద్వారా లబ్దిపొందినట్లు వార్తలు వస్తున్నాయి… వీరంద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు… అలాగే అతనికి రాజకీయనేతలతో సంబంధం ఉన్న విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి…