వైకుంఠ ఏకాదశిన తితిదే రెండు కీలక నిర్ణయాలు

వైకుంఠ ఏకాదశిన తితిదే రెండు కీలక నిర్ణయాలు

0
89

వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది, ప్రముఖులు సామాన్యులు స్వామిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు, టన్నుల పూలతో తిరుమల ఆనంద నిలయం అలంకరణ చేశారు. ఇక టిటీడీ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని, టీటీడీ బోర్డు సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, గతంలో మాదిరి రెండు రోజులు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఈ నెల 20 నుంచి ఉచిత లడ్డూలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.