వినాయక చవితి నుంచి చైనాకు షాక్ ఇస్తున్న భారతీయులు వేల కోట్ల లాస్

వినాయక చవితి నుంచి చైనాకు షాక్ ఇస్తున్న భారతీయులు వేల కోట్ల లాస్

0
128

చైనా నుంచి చాలా వస్తువులు మన దేశం దిగుమతి చేసుకోవడం లేదు.. మరీ ముఖ్యంగా చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన వివాదం తర్వాత చాలా వరకూ చైనా వస్తువులు మన దేశంలో బ్యాన్ కు గురి అయ్యాయి, మన దేశంలో అందరూ చైనా వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులని కొనుగోలు చేస్తున్నారు.

ఈ పండుగ సీజన్లో చైనాకు 40 వేల కోట్ల రూపాయల దెబ్బ తగలనుంది అంటున్నారు. చైనా వస్తువులు చాలా వరకూ ఈ పండగల్లో మన వారు వాడేవారు, కాని ఇప్పుడు అలాంటి పరిస్దితి లేదు దాదాపు ఈ వినాయకచవితికి చైనా గణేష్ విగ్రహాలను పెద్ద మొత్తంలో విక్రయించేవారు, కాని ఇప్పుడు అలా అమ్మడానికి ఏమీ లేదు, , దేశీయంగా ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలను తయారు చేయాలని భావించారు, దీంతో ఆ విగ్రహాలు ఎవరూ కొనడం లేదు అమ్మడం లేదు.

ఈ చవితి నుంచి దీపావళి సీజన్లో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విలువ 35 నుంచి 40 వేల కోట్లు ఉంటుంది, ఇప్పుడు అక్కడ వస్తువులు ఏమీ దిగుమతి చేసుకోవడం లేదు అని చెబుతున్నారు.
దేవుని విగ్రహాలు, ధూపం కర్రలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రిక్ బల్బులు, , అలంకరణ వస్తువులు, ఇత్తడి ఇతర వస్తువులు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతాయన్నారు. ఇక ఈ ఏడాది వ్యాపారులు కూడా చైనా వస్తువులకి ఆర్డర్ ఇవ్వలేదట.