కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది, దీని బారిన పడి చాలా మంది మరణించారు.. ఇప్పటికే 25 వేల మరణాలు సంభవించాయి, ఏకంగా కొన్ని లక్షల పాజిటీవ్ కేసులు వచ్చాయి, ఈ సమయంలో కరోనా మృతుల సంఖ్య అమెరికాలో మరింత పెరుగుతోంది, అక్కడ లక్ష పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
అయితే అమెరికాలో ఇలాంటి విపత్కర పరిస్దితిలో దేశ అధ్యక్షుడు ట్రంప్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు మొత్తం అమెరికా లాక్ డౌన్ అవుతోంది, ఈ సమయంలో అక్కడ పలు పెద్ద పెద్ద కంపెనీల అధినేతలు కరోనా పై వార్ కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.
ఈ సమయంలో తాజాగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణపై పరిశోధనలకు ఆ ఫౌండేషన్‌కు 25 మిలియన్ డాలర్లు అంటే రూ.187.19 కోట్లువిరాళం ప్రకటించారు. ఇది అమెరికన్ ప్రభుత్వానికి అందించనుంది ఫేస్ బుక్ సంస్ధ.