ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఈ సమయంలో వివాహాలు జరుగుతున్న వేళ అతి జాగ్రత్తలు తీసుకుని కొద్ది మంది సభ్యులతో వివాహాలు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించాల్సిన పరిస్థితి. ఇక వెబ్ లో ఆన్ లైన్ లోనే పెళ్లి లైవ్ అందించి దూరంగా ఉన్న వారు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
పెళ్లిని వెబ్ కాస్టింగ్ చేసి లైవ్ చూపిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ వర్చ్యువల్ పెళ్లిని ఇప్పుడు సరికొత్తగా చేశారు ఓకుటుంబం, తమిళనాడు ఫ్యామిలీ ఏకంగా ఇలా వారి ఇంట పెళ్లిని వెబ్ కాస్టింగ్ చేసింది, అలాగే వారు పెళ్లి విందు కూడా ఏర్పాటు చేశారు మరి ఇది ఎలా అంటే.
నాలుగు రంగురంగుల టిఫిన్ బాక్సుల్లో మొత్తం 18 రకాల వంటకాలను ఇళ్లకే పంపింది. ఇక వారి ఇంటికి ఇలా పెళ్లి ఫుడ్ తో పాటు వారికి అరిటి ఆకు కూడా పంపించింది, అంతేకాదు ఎక్కడ ఏ ఫుడ్ వడ్డించుకోవాలో కూడా తెలిపింది, దీంతో ఈ పెళ్లి ఆ విందు తెగ వైరల్ అవుతోంది మరి మీరు ఆ ఫోటోలు చూసేయండి.
ఆ విందు పిక్స్ చూడండి
New trend of marriage invitation. Marriage food will be delivered at your doorstep. pic.twitter.com/ooEz1qbsvP
— Shivani (@Astro_Healer_Sh) December 10, 2020