వైరస్ విషయంలో తెలంగాణకు అదిరిపోయే గుడ్ న్యూస్.

వైరస్ విషయంలో తెలంగాణకు అదిరిపోయే గుడ్ న్యూస్.

0
98

ఈ వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి…ఏకంగా ఒక్కరోజే 10000 కేసులు దాటి ఆల్ టైం రికార్డ్ నమోదు చేస్తున్నాయి, ఇలా భారీగా కేసులు నమోదు అవ్వడంతో అందరూ భయంతో ఉన్నారు, అయితే వైరస్ కేసులు పెరుగుతున్న వేళ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు ..కాని రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతోంది.

హైదరాబాద్ నగరంలో శరవేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతోంది ఇలా కేసులు పెరగడంతో. హైదరాబాద్ లో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయ్యిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలో దీనిపై క్లారిటీ వచ్చింది…అలాంటి పరిస్థితి రాలేదని ఏకంగా ఐసీఎంఆర్ ధ్రువీకరించింది. తెలంగాణలో సమూహ వ్యాప్తి జరగలేని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. ఇప్పటికే దీనిపై ఐసీఎంఆర్ సర్వే చేసింది. ఆ ఫలితాలు వెల్లడించింది. దీని ప్రకారం తెలంగాణలోనూ కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదట. దీంతో చాలా మంది ఆనందంలో ఉన్నారు, అందుకే ఎక్కువ జనాలు ఉన్న చోట గుంపుల్లో కలవకూడదు, అసలు గుంపులుగా ఉండకూడదు, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి.