విషాదం క‌రోనాతో ఎమ్మెల్యే మృతి

విషాదం క‌రోనాతో ఎమ్మెల్యే మృతి

0
85

అతి దారుణంగా వైర‌స్ విజృంభ‌ణ జ‌రుగుతోంది, ముఖ్యంగా చిన్నా పెద్దా లేదు అంద‌రికి వైర‌స్ సోకుతోంది, ఇక ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ముఖ్య‌మంత్రుల‌కి కూడా వైర‌స్ సోకుతోంది, ఇది అంద‌రిని క‌లిచివేస్తున్న అంశం.

ఇక తాజాగా వెస్ట్ బెంగాల్ లో ఓ ఎమ్మెల్యే వైర‌స్ సోక‌డంతో మ‌ర‌ణించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్, కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు.
ఆయ‌న మ‌ర‌ణం పై సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

ఈ ఘ‌ట‌న చాలా దురదృష్టకరం, ఫాల్టా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న తమోనాష్ ఘోష్ మనల్ని వీడి వెళ్లిపోయారు అని సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. ఆయ‌న 35 ఏళ్లుగా పార్టీకి సేవ‌లు అందించారు…ఇటీవల కరోనాతో తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నేత‌లు కూడా చాలా జాగ్ర‌త్త‌గా ప్ర‌జా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాలి అంటున్నారు స‌హ‌చ‌ర నేత‌లు.