విశాఖ ఘోర ప్రామాదంపై లోకేశ్ స్పందన….

విశాఖ ఘోర ప్రామాదంపై లోకేశ్ స్పందన....

0
96

వైజాగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు.. మొన్నటికి మొన్న రెండు ప్రమాదాలను ప్రజలు మరువక ముందే తాజాగా హిందుస్టాన్ ఫిష్ యార్ట్ లిమిటెడ్ లో దారుణం జరిగింది…

క్రైన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా ఆ క్రైన్ కుప్పకూలిపోయింది… ప్రమాదంలో పది మంది మృతి చెందారు… ఈ ప్రమాదంపై టీడీపీ నేత లోకేశ్ స్పందించారు… విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క‌చ‌ర్య‌లు చేప‌ట్టి క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు లోకేశ్… అలాగే మృతుల కుటుంబాల‌కు తన ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నానని అన్నారు లోకేశ్.. .మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు