విశాఖ రాజధాని భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ చేసిన వైసీపీ సర్కార్…

విశాఖ రాజధాని భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ చేసిన వైసీపీ సర్కార్...

0
85

విశాఖ రాజధానికి తాజాగా రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.. చట్ట సభల్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లు అలాగే సీఆర్ డీఏ బిల్లు ఆమోదం పొందకపోవడంతో సర్కార్ ఈ బిల్లులను గవర్నర్ కు పంపింది… తాజాగా గవర్నర్ ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు…

దీంతో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్ గా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్స్ గా ఏర్పడనున్నాయి.. రాజధాని బిల్లు ఆమోదం పొందటంతో పరిపాలన రాజధానిని సాధ్యమైనంత త్వరగా విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది..

అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఆగస్టు 15న విశాఖలో పరిపాలన రాజధానికి భూమి పూజ చేయనున్నారని సమాచారం అంతేకాదు స్వతంత్ర్య దినోత్సవ వేడుకలును కూడా విశాణలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి… ఇక ఆరోజు నుంచి సీఎం క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటు అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు…