విశాఖ రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్… ?

విశాఖ రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్... ?

0
200

ఏపీలో మూడు రాజధానులు… విశాఖ నుంచి పారిపాలన మరో సారి తెరమీదకు వచ్చింది… మే నెలలోనే ముందుగా రాజధాని తరలింపు కార్యక్రమం చేపట్టాలని భావించిన జగన్ సర్కార్ అందుకు పరిస్ధితులు అనుకూలించకపోవడంతో ఆలోచన వాయిదావేసుకున్నట్లు సమాచారం… ఇదే సమయంలో మూడు రాజధానులు బిల్లుపైన మండలిలో సెలక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం పైన వివాదం తేలలేదు… అదే సమయంలో హైకోర్టులో కార్యాలయాల తరలింపు వ్యవహారం పెండింగ్ లో ఉండటంతో ఈ సందేహాలు మొదలయ్యాయి…

అయితే ఇవన్నీ సాగుతుండగానే తాము అనుకున్న విధంగానే పరిపాలన రాజధానిగా విశాఖ ఉండాలని అక్కడ నుంచే పాలన చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది… ఇప్పుడు ప్రభుత్వం వర్గాల్లో ఇదే హాట్ టాపిక్… అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనే సందేహా వస్తున్నాయి… ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా మూడు రాజధానుల విషయంలో ముందుకూ వెళ్లాలని జగన్ పట్టుదలతో ఉన్నారు.. ప్రస్తుతం మరో మూడు నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు… కార్యాలయాల తరలింపు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు లో ఉంది…

అయినా సాంకేతికంగా న్యాయ పరంగా కొత్త పరిష్కార మార్గాలు ముఖ్యమంత్రి ముందుకు వచ్చినట్లు గా తెలుస్తోంది… అంతేకాదు ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ విషయాన్ని స్వయంగా రాజధాని తరలింపునకు ముహూర్తం ఫిక్స్ చేసిన విశాఖ శారధాపీఠం స్వామి స్వరూపానందేంద్ర చెప్పడం విశేషం… ఏపీ రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు అక్టోబర్ 25 విజయదశమి రోజున ముహూర్తం ఫిక్స్ చేసినట్లుస్వరూపానందేంద్ర స్వామి ఓ ఆంగ్ల పత్రికకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి…