విశాఖలో ఆ వైసీపీ నేత రాజకీయం అటు ఇటు కాకుండా పోయిందా…

విశాఖలో ఆ వైసీపీ నేత రాజకీయం అటు ఇటు కాకుండా పోయిందా...

0
91

ఉత్తరాంధ్ర జల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుల్లో దాడి వీరభద్రరావు కీలక నాయకుడు టీడీపీలో ఉన్న సమయంలో ఆయన ఓ వెలుగు వెలిగిన మాట వాస్తవం అయితే అనూహ్యంగా ఆయన 2014 కు ముందు చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతానికి విభేదిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు…అదే సమయంలో దూకుడుపై ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీ తీర్ధం తీసుకున్నారు..

దీంతో జగన్ ఆయన సీనియార్టీకి పెద్దపీట వేశారు… అన్నా అన్నా అంటూ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా మంచి గుర్తింపు ఇచ్చారు.. ఇక 2014 ఎన్నికల సమయంలో ఆయన కుమారుడు రత్నాకర్ కు విశాఖ నార్త్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.. అయితే ఆ ఎన్నికల్లో దాడి ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు… ఏకంగా అక్కడ బీజేపీ విజయం సాధించింది… ఇక 2016లో దాడి జగన్ తో విభేదించారు… చంద్రబాబు నాయుడు పాలనను మెచ్చుకుంటూ జగన్ ను తిట్టిపోసి మళ్లీ టీడీపీ జెండాను కప్పుకున్నారు…

ఆ సమయంలో ఏదైనా పదవి లభిస్తుందని భావించారు… కానీ రాలేదు.,.. దీంతో దాడి మళ్లీ జనసేనలో చేరుతారనే ప్రచారం సాగింది… కొన్నాళ్లకు మళ్లీ వైసీపీ పంచన చేరిపోయారు.. జగన్ కూడా వ్యూహత్మకంగా ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు… తన తనయుడికి టికెట్ ఇవ్వాలని కోరినా కూడా జగన్ తిరస్కరించారు..అనకాపల్లి టికెట్ ను గుడివాడ అమర్నాథ్ కు ఇచ్చారు… పైగా పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో దాడికి ఏ మార్గం లేక పార్టీలోనే కొనసాగుతున్నారు..

దాడి వీరభంద్రరావు సుదీర్ఘంగా గెలిచిన అనకాపల్లిలో ఆయన వైభవం అంతా గతమే అన్నట్లుగా మారింది… దాడి ఫ్యామిలీ అటు జగన్ కానీ ఇటు పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జ్ విజయసాయి రెడ్డి కానీ పట్టించుకోవడంలేదు పైగా వైసీపీ నాయకుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ తో దాడి వీరభద్రరావు అడుగడుగునా విభేదిస్తున్నారు… ఎమ్మెల్యే గుడివాడపై స్థానిక పత్రికల్లో వ్యతిరేకత వార్తలు రాయిస్తున్నారన్న చర్చలు సొంతపార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి…