కూతురు వివాహం కోసం పాత 1000, 500 దాచిన ఓ తల్లి…

కూతురు వివాహం కోసం పాత 1000, 500 దాచిన ఓ తల్లి...

0
96

రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి కొంత మొత్తాన్ని దాచింది ఒక మహిళ ఆ డబ్బును ఇంటివెనుక గోతి తవ్వి అందులో పూడ్చింది… అయితే ఇటీవలే వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయించడంతో అవి బయట పడ్డాయి…

వాటిని తీసుకుని బ్యాంకుకు వెళ్తే అధికారులు అవిచెల్లవని చెప్పడంతో వారు లబోదిబోమన్నారు… ఈసంఘటన తమిళనాడులో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నగపట్టణం జిల్లాలో ఒక గ్రామంలో ఒక తల్లి తన కూతురు వివాహం నిమిత్తం కొన్నేళ్లుగా డబ్బులు సంపాదించి పెడుతోంది… ప్లాస్టిక్ కవర్ లో మూట గట్టి ఇంటి వెనక గోతి తీసి పాతిపెట్టింది…

అయితే ఇటీవలే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో కూలీలు తవ్వుతుంగా ఆ ప్లాస్టిక్ మూట బయటపడింది… ఆ డబ్బునంతా తీసుకుని తమ ఖాతాలో డిపాజిట్ చేద్దామని దంపతులిద్దరూ బ్యాంకు కు వెళ్లారు.. అక్కడ అధికారులు మాటలు విని షాక్ కు గురి అయ్యారు… అవన్నీ నాలుగేళ్లక్రితమే రద్దు అయ్యాయని చెప్పారు… వాటి మొత్తం విలువ 35వేలు…