వివేకా హత్యకేసులో ఏ2 ఆయనే…

వివేకా హత్యకేసులో ఏ2 ఆయనే...

0
92

అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు… మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఏ2 విజయసాయిరెడ్డే అని ఆరోపించారు…

దారుణంగా జరిగిన ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. సీబీఐ విచారణ ఏ2 నుండి మొదలు పెట్టాలని కోరుతున్నమని బుద్దా వెంకన్న కోరారు. గుండెపోటు దగ్గర నుండి విచారణ మొదలు పెడితే వివేకా కేసు వెనుక ఉన్న
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటు బయటపడుతుందని ఆరోపించారు..

స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్ నే వేసేసారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడుతున్న ఒక సామాన్య బీసీ నాయకుడైన తనను వదులుతారని తాను అనుకోవడం లేదని అన్నారు…