ఒడిదొడుకుల విప్లవం..20 వసంతాల జ్ఞాపకం..మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ప్రకటన

Volatile Revolution..20 Memories of Spring..Maoist Party Spokesperson's Statement

0
101

మావోయిస్టు పార్టీ 20 వసంతాల వారోత్సవాలపై పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 2న 2000 సంవత్సరం నాడు మావోయిస్టు గెరిల్లా సైన్యం ఆవిర్భవించింది. ఈ సందర్బంగా మావోయిస్టు గెరిల్లా సైన్యానికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి.

20 ఏళ్ల వేడుకల సందర్భంగా సావనీర్ ను విడుదల చేస్తున్నాం. 20 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి అనేక మంది మావోయిస్టులు అమరులైన్నారు. అమరులైన మావోయిస్టులందరికి విప్లవ జోహార్లు. PLGA 2003 నుండి అనేక సాయుధ పోలీసు ఉద్యమాలను ఎదుర్కొంటుంది. భారత పాలక వర్గాలు కొనసాగిస్తున్న అణచివేత పై ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. 2005 జూన్ నుండి 2009 అనేక క్యాంపెన్ల తో తలపడింది. 2009లో కేంద్రం తలపెట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ తో తలపడింది. దాదాపు 9 ఏళ్ళ పాటు పోరాటం చేసి గ్రీన్ హంట్ ను తిప్పికోట్టింది. మే 2017 కేంద్రం తలపెట్టిన నక్సల్ నిర్ములను వ్యతిరేక క్యాంపెన్లను తిప్పికొట్టింది.

ప్రపంచ నెంబర్ వన్ శత్రువు అమెరికా కను సన్నల్లో మాపై దాడులను తిప్పికొట్టాం. సావనీర్ లో ఇటీవల ముగిసిన 8 మాసాల ఆపరేషన్ సమాధాన్ నిర్ణయాలు లేవు. ఈ దాడులు నవంబర్ 2020 నుండి జూన్ 2021 వరకు కొనసాగింది.. Plga కు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి విప్లవాబి వందనాలు. ఈ క్యాంపెన్ల తో 36 ఎన్ కౌంటర్ లలో 53 మంది విప్లవ కారులు మరణించారు.. 17 బూటకపు ఎన్ కౌంటర్ లలో 20 మంది విప్లవ ప్రజలు అసువులు బాసారు. ఇటీవల జరిగిన ప్రజా యుద్ధ ప్రతి ఘటనలో దండ కారణ్య ప్రత్యేక కమిషన్ అందించిన నివేదిక ప్రకారం 8 మాసాల ప్రతి ఘటనలో 90 మంది పోలీసులు మరణించారు.

ఇందులో 259 మంది పోలీసులు గాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 26న ఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల ముఖ్యమంత్రులతో, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మావోయిస్టులను కూకటి వేళ్ళతో మట్టుపెట్టాలని మోడీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తు అణచివేత పథకాన్ని రూపొందించాడు. దేశ విదేశాల్లో ఉన్న విప్లవ కారులు, విపక్ష శక్తులు, సామ్రాజ్య వాద వ్యతిరేక శక్తులు..గతం కన్నా మరింత ధృడ సంకల్పంతో ముందుకు రావాలి కోరుతున్నాం అని పేర్కొన్నారు.

నక్సల్స్‌ ఉద్యమానికి పురిటిగడ్డగా ఉన్న తెలంగాణలో పూర్వ వైభవం కోసం అనేక మంది మావోయిస్టు నేతలు, మిలిటెంట్లు, ఇన్‌ఫార్మర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఈ ఏడాది అత్యంత గడ్డు పరిస్థితులను మావోయిస్టులు ఎదుర్కొన్నారు.