కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడం ఇకపై ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. కొత్త సభ్యులు కొన్ని వ్యక్తిగత వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది.
పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు కాంగ్రెస్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో తెలుసుకుందాం.
నిబంధనలు:
1. మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.
2. ఖాదీ దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి.
3. సీలింగ్ చట్టం కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండొద్దు.
4. పార్టీ విధానాలు, కార్యక్రమాలలో పాల్గొనాలి.
5. పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించొద్దు.
6. సామాజిక వివక్ష ఉండకూడదు.
7. శారీరక శ్రమ చేసేందుకు వెనుకాడకూడదు.
సభ్యత్వ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 వరకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనున్నది. ఈ మేరకు ఇటీవలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ నిర్ణయాలను ఆమోదించారు.