రష్యా , ఉక్రెయిన్ ల యుద్ధం – వీటి ధరలు మరింత ప్రియం!

0
116

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధ ప్రభావం ప్రపంచంపై, మన దేశంపై ఉండనుంది. భారత్ లో పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుతాయా? వాణిజ్య రంగంపై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఏ మేరకు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గకుంటే దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

సెల్‌ఫోన్: ఫోన్ల తయారీలో వినియోగించే లోహం- పల్లాడియం అతిపెద్ద ఎగుమతిదారుగా రష్యా ఉంది. రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పల్లాడియం ధరలు మరింత పెరగనున్నాయి.

గోధుమలు: గోధుమలు ఎక్కువగా వినియోగించే దేశాల్లో మనదేశం ఒకటి కాగా.. ప్రపంచానికి ఎగుమతి చేసే దేశాల్లో రష్యా అగ్రగామి. గోధుమల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉక్రెయిన్‌ నిలిచింది.రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు పైకి చేరొచ్చు.

పొద్దుతిరుగుడు పువ్వు నూనె: గతేడాది మనదేశం 1.89 మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచే వచ్చింది. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. ఉద్రిక్తత మరో 2-3 వారాలు కొనసాగితే మనకు ఇబ్బంది తప్పదు.

టీ: భారత్‌ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లు కలవరపడుతున్నారు. రష్యాపై విధించిన ఆంక్షలతో చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు