SBI మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు, అయితే ఈ బ్యాంకు ఖాతాదారులకి బ్యాంకు అనేక అలర్ట్ లు ఇస్తూ ఉంటుంది, మోసగాళ్ల దగ్గర మోసపోకండి అని అనేక టెక్నికల్ విషయాలు చెబుతుంది, అంతేకాదు పిన్ ఓటీపీ మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఎవరికి షేర్ చేయద్దు అని హెచ్చరిస్తుంది, దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న బ్యాంకులో ఎస్ బీ ఐ ఉంది, సో కస్టమర్లని నిత్యం అలర్ట్ చేస్తుంది, తాజాగా కొన్ని తప్పులు చేయవద్దంటూ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నారు.
1. బయట అనేక మోసాలు జరుగుతున్నాయి, ఈ సమయంలో ఎవరిని బయట నమ్మి నెంబర్లు పిన్స్ ఓటీపీలు చెప్పకండి
2. బాగా తెలిసిన వారికి కూడా మీ ఏటీఎం కార్డ్ పిన్ ఇవ్వద్దు
3.వన్ టైమ్ పాస్వర్డ్ OTP, పిన్ నెంబర్, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డులపై ఉంటే సీవీవీ నెంబర్, యూపీఐ పిన్ అసలు ఎవరికి చెప్పవద్దు
4. ఏ బ్యాంకు అధికారి కస్టమర్ కేర్ నెంబర్ నుంచి మిమ్మల్ని ఈ డేటా అడగరు అడిగితే అది ఫేక్ కాల్ గమనించండి
5. మీకు తరకూ ఇలా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే దగ్గర్లో బ్యాంకుని సంప్రదించండి
6. కార్డ్ బ్లాక్ అవుతుంది అని కొందరు కాల్ చేస్తారు, మీరు మీ డీటెయిల్స్ ఇవ్వద్దు
7. నేరుగా బ్యాంకులోనే అప్ డేట్ చేసుకోండి, ఇలా ఆన్ లైన్ మోసగాళ్లకు దూరంగా ఉండండి
8. మరీ ముఖ్యంగా మీ సొంత స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ మినహా బ్యాంక్ లావాదేవీలు వేరే వాటిలో జరపకూడదని బ్యాంకు హెచ్చరించింది.