చైన్ స్నాచింగ్ ఈ మాట వింటేనే భయం కలుగుతోంది… మరీ ముఖ్యంగా ఆడవారి మెడ నుంచి చాలా మంది ఇలా బంగారు నగలు దొంగతనం చేస్తున్నారు… ఇలా దొంగలు పక్కా స్కెచ్ తో ముందు వెళుతున్న మహిళల మెడ నుంచి బంగారు గొలుసులు చోరీ చేస్తున్నారు.. కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. మెడ తెగి ప్రాణాపాయం వరకూ వెళ్లిన వారు ఉన్నారు, వీరిపై పోలీసులు నిఘా పెడుతున్నారు.
సీసీ కెమెరాల ద్వారా వీరిని పట్టుకుంటున్నారు,. తాజాగా కరామడై పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది.
గాంధీనగర్లోని కరామడైలో విజయలక్ష్మి బయట నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో, ఇద్దరు బైక్ పై వచ్చి ఇలా ఆమె మెడ నుంచి చైన్ లాక్క వెళ్లారు.. 2.5 సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు.
ఉదయం ఈ ఘటన జరిగింది అందరూ షాక్ అయ్యారు.. ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది…వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. వారి బైక్ నెంబర్ ఆధారంగా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.
మీరు ఆ వీడియో చూడండి