కొందరు జంతువులని దుర్మార్గంగా హింసిస్తూ ఉంటారు..మృగాళ్లా ప్రవర్తిస్తూ ఉంటారు, పాపం ఎదురుతిరిగి ఏమీ చేయలేని మూగజీవాలపై తమ రాక్షస క్రూరత్వం చూపిస్తారు… ఆవుని చూస్తే ఇంకా జాలి కలుగుతుంది అది ఎవరిని ఏమీ చేయదు సాధు జంతువు, అయితే దానిని ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హింసించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఆవు దూడపై ఓ వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇష్టానుసారం కొట్టాడు. పాపం అది ఏమీ చేయలేక అలా ఉండిపోయింది. ముందుకు నడవలేక అలా ఉండిపోయింది.. ఇది ఢిల్లీలోని వెస్ట్ వినోద్ నగర్లో జరిగింది. నడిచి వెళుతున్న వ్యక్తి దగ్గరకు దూడ వచ్చింది అయితే అతను కవర్ పక్కన వేసేశాడు..
తనపై కే వస్తావా అని కొమ్ములు పట్టుకొని హింసించాడు. ఆ కసి తీరాక తర్వాత రాయి పట్టుకుని దానిపై దాడి చేశాడు ఆ దెబ్బలు తట్టుకోలేక అది కింద పడిపోయింది.. ఈ దారుణ ఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతనిని శిక్షించాలి అని పోలీసులని నెటిజన్లు కోరుతున్నారు.
వీడియో చూడండి
This happened today in West Vinodnagar, Mandawali Buddha marg, Delhi. This man needs to be booked. pic.twitter.com/GeQ4UsEU1t
— Monisha # Stay Home ?? (@monisha_yadav) January 5, 2021