స్పైడర్మ్యాన్ ఈ పేరు వింటే మనకు ఒకటే గుర్తు వస్తుంది …బలమైన థ్రెట్ తో ఈజీగా బిల్డింగులు ఎక్కేస్తూ దూకుతూ కనిపించే క్యారక్టర్, అయితే తాజాగా ఇలాంటి సినిమాలు మనం చూస్తున్నాం.. మరి నిజంగా ఇవి సినిమాల్లోనే కాని నిజ జీవితంలో ఉండవు కదా అని మనకు అనిపిస్తుంది, అయితే తాజాగా ఇలాంటి సీన్ ఒకటి కనిపించింది. మరి రియల్ స్పైడర్ మ్యాన్ అని అందరూ అంటున్నారు అతనిని చూసి.
58 అంతస్తుల భవవాన్ని ఎక్కి అందరి దృష్టినీ ఆకర్షించాడు ఈ వ్యక్తి. దీంతో నిజమైన స్పైడర్మ్యాన్ అతడేనంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..లియో అర్బన్ అనే యువకుడు ఇలా ఎక్కుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు, ఇతన్ని సినమాలో పెడితే గ్రాఫిక్స్ డూబ్ అక్కర్లేదు అంటున్నారు.
మరో విషయం ఎలాంటి భద్రతా సామాగ్రి వాడకుండా చేతులతోనే పారిస్ మోంట్పార్నాస్సేలోని భవనాన్ని అతను ఎక్కాడు. కేవలం గంటలోపే అంత ఎత్తైన భవనాన్ని ఎక్కి అందరిని ఆశ్చర్యపరిచాడు ఇది పారిస్లో బిల్డింగ్, సుమారు 210 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైకి ఎక్కిన అతను రికార్డు క్రియేట్ చేశాడు.
మరి మీరు ఆ వీడియో చూడండి
Il y a quelqu’un sur #Montparnasse pic.twitter.com/dsIjtbQ76f
— Jérémy Descours (@JeremyDescours) December 5, 2020