ఆకాశంలో ఒక్కోసారి కెమెరాల కంట పడుతూ ఉంటాయి ఉల్కలు …రాత్రి సమయంలో వీటి వెలుగులు బాగా కనిపిస్తాయి, కొన్ని ఉల్కలు చాలా దూరంగా సముద్రాల్లో కూడా పడిపోతూ ఉంటాయి, అయితే ఇప్పుడు ఇలాంటి ఉల్క ఒకటి పెను వైరల్ అవుతోంది. ఆ ఫోటోలు వీడియోలు చూద్దాం.
జపాన్ లో ఆదివారం వేకువజామున ఓ ఉల్క కనువిందు చేసింది. ఇది ఎంత పెద్ద ఉల్క అంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇది కనిపించింది, అయితే ఇది విస్పోటనం జరిగింది అని తెలుస్తోంది.
మండుతున్న అగ్నిగోళంలా భూవాతావరణంలో ప్రవేశించిన ఈ ఉల్క ఒక్కసారిగా విస్ఫోటనం చెందినట్టుగా వెలుగులు విరజిమ్మింది.
దేశంలో ప్రధాన నగరాలు అయిన టోక్యో, యమగుచి, ఒకాయామో, షిజువోకా వంటి అనేక ప్రాంతాల్లో కనిపించడంతో అందరూ చూశారు, ఈ వీడియో ఆ దేశం నుంచి ప్రపంచానికి వైరల్ గా వచ్చేసింది. మరి ఆ వీడియో మీరు చూసేయండి.
People across wide areas of Japan were treated to a spectacular light show in the early hours of Sunday, thanks to what is believed to be a meteor. pic.twitter.com/r0HfI082SK
— NHK WORLD News (@NHKWORLD_News) November 30, 2020