తిరుమలలో వాటర్ బాటిల్స్ నిర్ణయానికి బ్రేకులు

తిరుమలలో వాటర్ బాటిల్స్ నిర్ణయానికి బ్రేకులు

0
97

తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లేకుండా చేశారు… ఎక్కడా షాపుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అమ్మడం లేదు.. ఇంకా మినరల్ వాటర్ రూపేణా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్యాకెట్లని మొత్తం తిరుమల ఆలయ పరిసరాల్లో మెట్ల మార్గంలో అన్నీ చోట్లా అమ్మకాలు ఆపేశారు, మరి వాటర్ సమస్య లేకుండా తాజాగా
గాజు వాటర్బాటిళ్ల అమ్మకం చేయాలని అనుకున్నారు.

కాని తాజాగా ఈ నిర్ణయానికి బ్రేక్ పడింది., ఇటీవల జలప్రసాదాల కేంద్రాలు, కాటేజీల దగ్గర వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేసినప్పటికీ నీటిని తీసుకెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటోందని పలువురు ఫిర్యాదు చేయడంతో టీటీడీ ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించింది.

అందుకే గాజు వాటర్ బాటిల్స్ రూపేణా మంచి నీరు అందించాలని అనుకున్నారు, వ్యాపారులు కూడా ఇదే సలహాగా చెప్పారు. 20 రూపాయలతో గాజు వాటర్ బాటిల్ అందించాలని అనుకున్నారు.. నిన్నటి నుంచి వీటిని అమ్మాలి అని అనుకున్నారు, కాని గాజు సీసాల వాడకంలో కొన్ని సమస్యలు వస్తాయని భావించిన ప్రభుత్వం కొద్దిరోజుల పాటు వీటి అమ్మకాల నిర్ణయం ఆపాలి అని తెలిపింది.