ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలోని తపోవన్ ప్రాంతంతో పాటు రేని గ్రామం సమీపంలోని రుషి గంగ పవర్ ప్రాజెక్టు దగ్గర ఆకస్మికంగా వరదలు వచ్చాయి.. మంచు చరియలు విరిగిపడి నది ఉప్పొంగింది.. డ్యామ్ కొట్టుకుపోయింది..దీంతో భారీగా వరద నీరు గ్రామాలపై ఉగ్రరూపం దాల్చింది.
ఈ ప్రవాహానికి తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 150 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ రేనీ గ్రామ పెద్దలు గతాన్ని గుర్తు చేస్తున్నారు, ఇక్కడ దేవి మాత ఆలయాన్ని తొలగించడమే ఈ ఘటనకు కారణం అంటున్నారు.
రుద్రప్రయాగ్ జిల్లాలోని శ్రీనగర్ సమీపంలో ఆనాటి ప్రభుత్వం హైడల్ పవర్ ప్రాజెక్ట్ చేపట్టాలని భావించింది. ఈ సమయంలో ఈ ప్రాజెక్ట్ కు అడ్డుగా ఉన్న ధారి దేవి మందిరాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించారు. ఆ సమయంలో ప్రజలు ఇలా తరలించవద్దు అని కోరారు.. కాని ప్రాజెక్టు ముందుకు కదిలింది.గత సంవత్సరం ఈ ఆలయాన్ని పవర్ ప్లాంట్ అధికారులు తొలగించారు. అయితే మరో చోట ఈ ఆలయం కట్టలేదు. దీంతో ఆ దేవత ప్రకోపంతో ఇలా జరిగింది అంటున్నారు గ్రామస్తులు.