తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్

0
73

కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. TRSLP సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని తీర్మానం చేస్తాం. పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలి. రేపు మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారు. బాయిల్డ్ రైస్ తీసుకుంటారా లేదా రా రైస్ తీసుకుంటారా అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని కేసీఆర్అన్నారు.

ఒకవేళ ధాన్యం కొనుగోలుకు కేంద్రం సమ్మతించకుంటే తెలంగాణ ఉద్యమం స్థాయిలో కేంద్రంపై పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు. ఆహార ధాన్య సేకరణలో ‘ఒకే దేశం-ఒకే సేకరణ’ విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు సృష్టించింది.

ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం వస్తుంది. 3 లక్షల ఎకరాలు విత్తనాల కోసం రైతులు వాడుకుంటారు. మరో 2 లక్షల ఎకరాలు సొంత అసరాలకు వాడుకుంటారు. పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాలు తగ్గింది. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలి. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్‌ చేసి నష్టం వస్తే కేంద్రం భరించాలిన్నారు కేసీఆర్.