Flash: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్ ఏమన్నారంటే?

0
62

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు కీలక ప్రకటన చేశారు.

సీఎం కేసీఆర్ కి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు. నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎంకి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. వారు స్టేబుల్ గా ఉన్నారు. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే అని డాక్టర్ వెల్లడించారు.