వీహెచ్ ను కలవాల్సిన అవసరం హరీష్ రావుకు ఏంటి: అద్దంకి దయాకర్‌

0
186

తెలంగాణలో సీనియర్‌ కాంగ్రెస్ నేతల మీటింగ్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ అద్దంకి దయాకర్‌, బెల్లయ్య నాయక్‌, మానవతా రాయ్‌, ఈరవర్తి అనిల్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, అయితే ఇలాంటి తరుణంలో కొంతమంది వల్ల పార్టీలో ఇబ్బందికరంగా మారింది.

టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో విభజించు పాలించులాగా చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన పాలన లాగా చేస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలను, ఎంపీలు, ఎమ్మెల్సీలు సర్పంచులు అందరిని పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. మా పార్టీ నాయకులు చేరితే తప్ప టిఆర్ఎస్ బలపడే పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయ్యాక అన్ని సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయి. మా పార్టీ నాయకులతో టిఆర్ఎస్ నాయకులకు ఏమి పని. మంత్రి హరీష్ రావు మా పార్టీ సీనియర్ నేత వి.హెచ్ తో కలిశారు. ఇది కొకపేటలో జరిగింది. మేము బయట పెట్టాలనా.. వి.హెచ్ గారు అంటే మాకు గౌరవం ఉంది. పార్టీలో సమస్యలు ఉంటే కొట్లాడండి కానీ శత్రువు దగ్గర మొకరిల్లితే ఎలా..ఇది కాంగ్రెస్ కార్యకర్తల బాధ.. విహెచ్ నిబద్ధత గల నాయకులు తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎంతో కష్టపడ్డారు.

ఆయనను హరీష్ రావు రహస్యంగా కలిసి ఏమి చేశారు. హరిశ్ రావ్ కలవగానే ఇక్కడ పార్టీ మీటింగ్ ప్రారంభం అయ్యాయి. పార్టీలో అంతర్గత సమావేశంలో ఏమైనా మాట్లాడండి కానీ బయట శత్రువు దగ్గర రహస్య సమావేశాలు ఎందుకు.. టిఆర్ఎస్ కు కాంగ్రెస్ అంటే ఎందుకు భయం..హరీష్ రావు కు వి.హెచ్ ను కలవాల్సిన పని ఏంది.. తెలంగాణ ఇచ్చి రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన కూడా తెలంగాణలో కాంగ్రెస్ పట్ల హరీష్ రావు ఇలా చేయడం ఏంటి. సిగ్గుందా హరీష్ రావు.

హరీష్ రావు మా వి.హెచ్ తో ఎందుకు రహస్యంగా కలిసారో చెప్పాలి. కార్యకర్తలు పార్టీ కోసం ఎంతకైనా తెగించి పార్టీ కోసం పనులు చేస్తున్నారు. వి.హెచ్ మా నేత ఆయనకు ఎలాంటి పార్టీ సమస్యలు ఉన్నా పార్టీలో చర్చించాలి. రేవంత్ రెడ్డి పార్టీ కోసం ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్లు కలిసి రావాలి. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని అద్దంకి దయాకర్ కోరారు.