మనం చాలా సార్లు చూశాం ఎక్కడైనా పెట్రోల్ ట్యాంకర్ డీజీల్ ట్యాంకర్ నుంచి అవి లీక్ అయినా బోల్తా కొట్టినా ఆ డీజీల్ పెట్రోల్ చాలా మంది బాటిల్స్ లో తీసుకువెళ్లడం అనేక ఘటనల్లో చూశాం, అయితే ఇప్పుడు వంట నూనె లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఇక జనానికి తెలిసింది మొత్తం పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆ ఆయిల్ తమ గిన్నెల్లో బాటిల్స్ లో నింపుకున్నారు.
ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురిలో చోటుచేసుకుంది. గుమ్మడిపూండి నుంచి కృష్ణగిరి జిల్లా రాయకోట్టైలోని ప్రైవేట్ వంట నూనె శుద్ధీకరణ పరిశ్రమకు ట్యాంకర్ నూనెతో వెళుతోంది… కరెక్టుగా కృష్ణగిరి దగ్గర ప్రాంతంలో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది.
ఇది వరిపొలంలో పడిపోయింది దీంతో పెద్ద ఎత్తున అక్కడకు జనం చేరారు, ఇక నూనె కారుతోంది అని తెలిసి అందరూ డబ్బాలు తెచ్చుకుని నింపుకున్నారు, తర్వాత పోలీసులు చేరుకుని వారిని నూనె తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుసుకుంటున్నారు.