టీ.నగర్లోని దిండుగల్ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర పోలీసు కంట్రోల్రూంలో పనిచేస్తోంది.. ఆమె వయసు 38 ఏళ్లు, ఆమె భర్తను విడిచి ఉంటోంది.తన బిడ్డతోపాటు అక్క వాసుకితో ఉంటోంది, అయితే మెడికల్ లీవులో ఉన్న ఇందిర సెలవులు ముగిసినా విధులకు హాజరుకాలేదు. దీంతో ఆమెకి ఏమైంది అని తెలుసుకోవాలి అని ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో ఇంటిలో ఓ గది తలుపు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన మహిళా పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. ఒక్కసారిగా షాక్ అయ్యారు…ఎందుకు అంటే తమతో పని చేసిన ఆమె చనిపోయి ఉంది… ఆ శవం ఆ రూమ్ లో ఉంచారు..ఇందిర మృతదేహం వస్త్రాలతో చుట్టి ఉంది. వాసుకి, సుదర్శనం పక్కన ఉన్నారు.
దీనిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇంటిలో వారిని విచారించారు, అయితే వారు ఏం చెప్పారంటే.. ఇందిర డిసెంబర్ 7న మృతిచెందిందని, ఏసుక్రీస్తులా ఆమె మళ్లీ బతుకుతుందని, అందుకోసం రోజూ ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. స్ధానికులే కాదు మొత్తం అక్కడ ఈ వార్త విన్న అందరూ షాక్ అయ్యారు, చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.. ఆమె చివరి ఘడియలు పూర్తి చేస్తున్నారు.