ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో మంచి హిట్ అందించింది బన్నీకి, మొత్తానికి అదే జోష్ తో ఆయన పుష్ప సినిమాని చేస్తున్నారు.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు, మాస్ లుక్ లో బన్నీ అదరగొడుతున్నారు అనే చెప్పాలి, ఇక లాక్ డౌన్ తో ఏడు నెలలుగా సినిమా షూటింగ్ జరగలేదు.ఇక ఈ నెలలో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొంత జరుపుకుంది.
ఇక్కడ లారీపై సీన్లు అలాగే ఫైట్లు పలు యాక్షన్ సన్నివేశాలు జరిపారు, అయితే తాజాగా కాశీ వెళ్లనున్నారు చిత్ర యూనిట్.
డిసెంబర్ 18 నుంచి అక్కడ కొత్త షెడ్యూల్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూలుని వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక్కడ కాశీ లోసాంగ్ రెండు సీన్లు షూట్ చేయనున్నారట.
ఇక ఈ సినిమా కథాంశం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది, ఇందులో బన్నీ పుష్పరాజ్ గా నటిస్తున్నారు, ఇక హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే, ఇక దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నారు, వచ్చే ఏడాది ఈ చిత్రం రానుంది.