ఈ ఏడాది కరోనా సమయంలో చాలా వరకూ వ్యాపారాలు తగ్గాయి.. మరీ ముఖ్యంగా ఆరు నెలల కాలంలో ఎలాంటి బిజినెస్ యాక్టివీటి జరగలేదు, అయితే తాజాగా చైనా నుంచి భారత్ కు బాగా ఎగుమతులు తగ్గాయి అనేది తెలిసిందే.. చాలా చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకూ భారత్ కు చైనా నుంచి దిగుమతులు తగ్గాయి.. ఇటు చైనా భారత్ మధ్య వచ్చిన ఉద్రిక్తలతో ఈ వ్యాపారాలు తగ్గాయి.
అయితే అనూహ్యాంగా తెలుస్తోంది ఏమిటి అంటే.. మన నుంచి ఎగుమతులు వారికి పెరిగాయి, అలాగే వారి నుంచి మన దేశంలోకి దిగుమతులు తగ్గాయి…భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 16 శాతం పెరిగాయి.చైనా నుంచి భారత్కు దిగుమతులు 13 శాతం తగ్గాయి.
చైనా నుంచి భారత్ ఎక్కువగా ఆర్గానిక్ కెమికల్స్, ఎరువులు, యాంటీ బయోటిక్స్, అల్యుమినియం ఫోయిల్ను దిగుమతి చేసుకుంది. అయితే మరి మన దేశం నుంచి చైనాకి ఏమి వెళ్లాయి అనేది చూస్తే… ముడి ఇనుము, ముడి డైమాండ్స్, కాటన్, గ్రానైట్ స్టోన్, చేపలు వంటివి ఎక్కువగా అక్కడకు ఎగుమతి అయ్యాయి, ఈ ఏడాది క్రాకర్స్ ,ఎలక్ట్రానిక్ గూడ్స్ , క్రాఫ్ట్ ఐటెమ్స్ కూడా చాలా వరకూ చైనా నుంచి మన దేశం దిగుమతి చేసుకోలేదు.