దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మదనపల్లె జంట హత్యల కేసు, సొంత తల్లిదండ్రులే మూఢనమ్మకాలతో ఇద్దరు కూతుళ్లని చంపేశారు, ఈ ఘటనపై అందరూ బాధపడ్డారు, అయితే ఇంకా ఆ తల్లి పద్మజ మాత్రం నేను శివుడ్ని కరోనా నా నుంచి వచ్చింది ఇలా మాట్లాడుతోంది.. ఆమెకి చికిత్స అవసరం అని మానసిక వైద్య నిపుణులు తెలిపారు.
అయితే ఇంత బాగా ఉన్నత విద్య చదివి సమాజంలో మంచి పేరు ఉండి పెద్ద ఉద్యోగం చేస్తున్న వీరు ఇలాంటి పని చేశారు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. తాజాగా పురుషోత్తం నాయుడు సోదరుడు దిలీప్ కూడా ఈ ఘటనపై స్పందించారు. చిత్తూరు జిల్లా అరగొండ సమీపంలోని ఓ గ్రామంలో తాము నివసించేవారమని చెప్పారు.
ఇక తన అన్న గురించి పలు విషయాలు చెప్పారు ఆయన… మేము ముగ్గురం అన్నదమ్ములం, నాకు పురుషోత్తం అన్నయ్య అవుతాడు, ఇంటిలో వదినకు భక్తి చాలా ఎక్కువ .. అంతేకాదు వారి పెద్ద కుమార్తెకు కూడా భక్తి ఎక్కువ.. అలేఖ్య కూడా విపరీతమైన పూజలు చేసేది. చివరకు అదే ఇంత దారుణమైన స్దితికి తీసుకువచ్చింది అని కన్నీరు పెట్టుకున్నారు ఆయన.