తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ వస్తోంది వైయస్ షర్మిల తన కొత్త రాజకీయ పార్టీపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, తాజాగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త వినిపిస్తోంది..వైఎస్సార్ టీపీ పేరుతో ఎన్నికల సంఘానికి వైయస్ షర్మిల దరఖాస్తు కూడా చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి పార్టీ పేరు ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఓ డేట్ వినిపిస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని
అంటున్నారు, అంతేకాదు వచ్చే నెల 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ సమయంలో ఆమె రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటన రావచ్చు అంటున్నారు.
ఇక ఇక్కడ సభ తర్వాత తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో ఆమె పర్యటన ఉండవచ్చు అంటున్నారు, ఇక జూలై 8న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.. అంతేకాకుండా పార్టీ ప్రకటనకు ముందే ఈ నెల 16 నాటికి మండల కమిటీల నియామకం పూర్తిచేయాలని పట్టుదలగా ఉన్నారట వైయస్ షర్మిల.