రాహుల్ గాంధీ చేసిన దాంట్లో తప్పు ఏముంది ?

0
91

నేపాల్‌లోని ఓ పబ్‌ లో ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, బిజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా కలిసి ఎంజాయ్‌ చేస్తున్న వీడియో బయటకు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.  చైనా వ్యక్తితో రాహుల్‌ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్‌ నేతలు అందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ ఘటనపై స్పందించి రాహుల్ గాంధీ చేసిన దాంట్లో తప్పు ఏముందని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఫంక్షన్‌కు పిలిస్తే వెళ్లడంలో తప్పేముందని, ప్రస్తుతం వైరల్ చేస్తున్న వీడియోలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. ఫంక్షన్‌కు వెళ్ళిన చోట ఏముందో రాహుల్ గాంధీకి ఎలా తెలుస్తుందని మండిపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఏదెదో ఊహించుకుని ప్రచారం చేసే మూర్ఖులకు ఏం చెప్తామని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ బహిరంగంగానే ఫంక్షన్‌కు వెళ్లాడని చెప్పారు. పెళ్లికి వెళ్లిన వీడియోని చుపిస్తూ రాహుల్ గాంధీ పైన అనవసమైన అబాండాలు వేస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల చిల్లర వ్యవహారం ఇంకా ఎప్పుడు మారుతారని ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలలో రాత్రిపూట తిరిగే నేతలు లేరా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లీడర్లకు హయత్ హోటల్‌లో రూమ్‌లు కూడా ఉన్నాయని ఆరోపించారు. రాత్రిపూట హోటల్ సూట్లలో తందనాలు ఆడేవాళ్లు కూడా ఉన్నారని, కానీ వారి వారి పేర్లు చెబితే బాగుండదని చెప్పారు. రాహుల్ గాంధీ ఫంక్షన్‌కు వెళ్ళితే ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు.