మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ ఏం చేయాలి

What should do the deceased person Aadhaar card

0
114

మన దేశంలో ప్రతి వ్యక్తికి 12 అంకెలతో కూడిన విశిష్ట గుర్తిపు కార్డు ఆధార్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆధార్ కార్డ్ ఉంటోంది. అన్నీ పథకాలకు ఇప్పుడు ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ లో ఆ వ్యక్తి వివరాలు వేలిముద్రలు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్ధ.

అయితే ఆ వ్యక్తి చనిపోయిన తరువాత ఆధార్ ఏం చేయాలన్న దానిపైనే అనేక సందేహాలు వస్తున్నాయి. మరణించిన వ్యక్తి ఆధార్ ని రద్దు చేసే నిర్ణయం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఆ ఆధార్ నెంబర్ ను వేరొకరికి కేటాంచరు. ఎందుకంటే ప్రతీ ఒక్క వ్యక్తికి ఓ కొత్త నెంబర్ మాత్రమే వస్తుంది.

ఈ విషయంపై కేంద్ర ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో సమాధానమిచ్చారు. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును అధికారులకు అప్పగించేలా త్వరలో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు చెప్పారు. ఆ మరణించిన వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ కి అప్లై చేసే సమయంలో అతని ఆధార్ కార్డును జనన,మరణాల శాఖ అధికారులకు అందించాల్సి ఉంటుంది. అప్పుడు యూఐడీఏఐ ఆ కార్డుని రద్దు చేస్తుంది