ఆ అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించాడు, అయితే ఆమెకి వేరే యువకుడితో నిశ్చితార్దం జరిగింది, దీనిని అతను తట్టుకోలేకపోయాడు… చివరకు ఆమె ఎవరికి దక్కకూడదు అనే కోపంతో ప్రియురాలిని తుపాకీతో కాల్చేశాడు..
ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో జరిగింది.
మలాడ్ ప్రాంతానికి చెందిన వివేక్ – జాన్వీ ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఇక ఆమె ఇంట్లో తెలిసి ఆమెని ఈ ప్రేమ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి వేరే సంబంధం చూశారు. చివరకు జాన్వీకి వేరే యువకుడితో ఎంగేజ్ మెంట్ చేశారు… ఇటు పెద్దలను ఎదిరించలేకపోయింది ప్రియుడికి ఎంత చెప్పినా తను తట్టుకోలేకపోయాడు.
ప్రియురాలు తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటుందని కక్ష పెంచుకున్న వివేక్, ఆమెని తుపాకీతో కాల్చి చంపాడు.. చివరకు అదే తుపాకితో తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు..