విద్యార్దులకి మంచి చదువు చెప్పి వారు ఉన్నత స్ధితికి చేరుకోవడానికి ఉపాధ్యాయులే కారణం.. వారు చెప్పే చదువు బట్టీ పిల్లలు అంత మంచి పొజిషన్ కు వెళతారు, అయితే ఈ కరోనా వల్ల చాలా మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయారు.. ఏకంగా 9 నుంచి 10 నెలలు స్కూళ్లు తెరవక జీతాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు.
ఇక పాఠాలు చెప్పే కొందరు టీచర్లు బతుకు బండి లాగడానికి వారు కూరగాయలు పళ్లు అమ్ముకున్నారు… కొందరు కూలీపనులకి కూడా వెళ్లారు ఇలా చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకున్న వారు ఉన్నారు.
పట్టణాల నుంచి పల్లెలకు కూడా వెళ్లిపోయిన వారు ఉన్నారు, తాజాగా ఈ కరోనా లాక్ డౌన్ వేళ ఇబ్బంది పడ్డ టీచర్ల పై ఓ సర్వే చేస్తే అందులో అనేక విషయాలు బయటకు వచ్చాయి..చాలా మంది టీచర్లు ఐదు నెలలు ఇంటి రెంట్ కట్టలేక బకాయి పడ్డారట… అంతేకాదు 85 శాతం మంది బంగారం తాకట్టు పెట్టుకున్నారు .50 వేల పైనే అప్పు తీసుకున్న వారు దాదాపు 80 శాతం మంది ఉన్నారు… 15 వేల కంటే తక్కువ జీతం ఉన్న వారి కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయట.. కొందరు బైక్ బంగారం కూడా అమ్మేశారట. దాదాపు 80 శాతం మందికి గత ఏడాది ఏప్రిల్ నుంచి స్కూళ్లు కాలేజీలు జీతాలు చెల్లించలేదు.