గర్ల్‌ఫ్రెండ్స్‌కు గిఫ్టులు ఇవ్వాలి అని చాలా మంది పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తూ ఉంటారు.. ముఖ్యంగా వారి బర్త్ డే లకి సర్ ఫ్రైజ్ గిఫ్టులు ఇస్తూ ఉంటారు, అయితే ఇక్కడ కూడా ఇలాంటి ప్లాన్ వేసి అడ్డంగా బుక్ అయ్యారు ఇద్దరు ఫ్రెండ్స్.
తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు కొత్త మొబైల్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ మొబైల్స్ కొనడానికి తమ వద్ద డబ్బులు లేవు. ఇక చోరి చేయాలి అని ప్లాన్ వేశారు, ఇలా ఎక్కడ మొబైల్స్ దొరికినా అక్కడ దోచేయడం మొదలు పెట్టారు.
ఇలా మొత్తమ్మీద 26 మొబైల్స్ దొంగతనం చేశారు. వీటి విలువ సుమారు 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక వారికి కొత్త మొబైల్ ఇవ్వడం పాత ఫోన్ అమ్మేయడం ఇలాంటి పని చేశారు, వారు కూడా వీరు కొత్త ఫోన్లు ఇస్తున్నారు అని సంతోషంగా వాడుకునే వారు… సీన్ మొత్తం తెలిసి షాక్ అయ్యారు పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు.. వీరి నుంచి మూడు బైక్ లు స్వాధినం చేసుకున్నారు.