మనం రెస్టారెంట్ హోటల్ కి వెళితే కచ్చితంగా తిన్నా ఫు్డ్ కి బిల్ చెల్లిస్తాం, కచ్చితంగా టిప్ కూడా చదివిస్తాం, గతంలో బిల్లు కట్టకపోతే పని చేయించేవారు, ఇప్పుడు అదేమీ లేదు నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళుతున్నారు, మరి ఇలాంటి సమయంలో ఈ రెస్టారెంట్లో మీరు ఎంత తిన్నా బిల్లు కట్టక్కర్లేదు, ఇదేంటి అని ఆశ్చర్యం వద్దు ఇది అక్షరాలా నిజం. అంతేకాదు మీకు నిజంగా ఇవ్వాలి అనిపిస్తే నగదు ఇవ్వచ్చు, అది ఎంతైనా ఇవ్వచ్చు, మీరు తిన్నదానికి సరిసమానంగా ఇవ్వచ్చు, లేదా తగ్గించి అయినా ఇవ్వచ్చు.
ఈ రెస్టారెంట్ పేరు సేవా కేఫ్. ఇది అహ్మదాబాద్లో ఉంది.ఈ రెస్టారెంటు 11 ఏళ్ల నుంచి నడుస్తూనే వస్తోంది. మరి ఎవరూ నగదు ఇవ్వకపోతే ఎలా అని అనుకోకండి, చాలా మంది తిన్నాదానికంటే ఎక్కువ ఇస్తారు, మరికొందరు తిన్నా దానికి సగం బిల్లు ఇస్తారు, సో ఇలా రన్ అవుతోంది.
లాస్ లేకుండా ముందుకు సాగుతోంది..ఇలా గిఫ్ట్ డబ్బులతోనే సేవా కేఫ్ రెస్టారెంట్ 11 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది.
ఈ కేఫ్ను మానవ్ సాధన్ అండ్ స్వచ్ సేవా సాధన్ అనే ఎన్జీవో నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రెస్టారెంట్ తెరిచి ఉంటుంది. ఇక ఇందులో ఆదాయం వస్తే ఛారిటీ ఫండ్ కు వెళుతుంది, ఇక్కడ పనిచేసేవారికి జీతం ఉండదు, వారు ఉచిత సర్వీస్ చేయాలి, ఇక్కడ వంట చేయచ్చు, క్లీన్ చేయచ్చు, సర్వ్ చేయవచ్చు.