కొత్త కొత్త యాప్స్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి, ఇక కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇప్పుడు చాలా మంది ఇక స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ నే ఎక్కువగా వాడుతున్నారు, ఇక తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్న వేళ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
ఈ సమయంలో అందరూ ‘జూమ్’ యాప్. వాడుతున్నారు.ఇదో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. దీని సాయంతో అత్యధికులు ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే వీలుంటుంది. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడిది భారత్ లో అత్యధికంగా డౌన్ లోడ్ అవుతున్న నెంబర్ వన్ యాప్ గా నిలిచింది.
ఇండియాలో జూమ్ యాప్ ధాటికి వాట్సాప్, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ కూడా వెనుకబడ్డాయి. ఇప్పటివరకు ప్లే స్టోర్ నుంచి ‘జూమ్’ యాప్ ను 50 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ‘జూమ్’ యాప్ లో వైర్ లెస్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇక ఒకేసారి 50 మందితో వీడియో కాల్ చేయవచ్చు…అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే జూమ్ యాప్ సంస్థ అధినేత ఎరిక్ యువాన్. తన సంస్థను కొద్దికాలంలోనే వేల కోట్ల విలువైన సంస్థగా మలిచాడు.