వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తప్పక తెలుసుకోండి

వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తప్పక తెలుసుకోండి

0
106

ప్రతీ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు వాట్సాప్ ఉంటోంది. వాట్సాప్ లేని ఫోన్ లేదు అనే చెప్పాలి..
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ అందిస్తుంది. ఇప్పటికే అనుమతిలేకుండా ఇతరులు మీ వాట్సాప్లో లాగిన్ అవ్వకుండా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఆప్షన్ను అందుబుటులోకి తెచ్చింది, ఇది కూడా చాలా మంది యూజర్లు సూపర్ ఫీచర్ అంటున్నారు.

అయితే ఇక మీరు పంపే మెసేజీలు వీడియోలు ఇమేజ్ లు వారికి పంపిన తర్వాత నిర్ణిత సమయంలో డిలీట్ అయ్యేలా ఫీచర్ ఉంది, తాజాగా మరో ఫీచర్ వస్తోంది, అది ఏమిటి అంటే అవతలి వాళ్ల వాట్సాప్కు మనం పంపిన సమాచారం ఎప్పుడు డిలీట్ చెయ్యాలా? అనేది ఎంచుకునేలా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్ను అందుబాటులోకి తేనుంది.

మీరు ఏదైనా మెసేజ్ పంపితే అది పదినిమిషాల తర్వాత డిలీట్ అవ్వాలి అంటే, సెండ్ బటన్ పక్కన టైమర్ లో సమయం సెలక్ట్ చేసుకోవాలి, అప్పుడు మీరు ఇచ్చిన సమయానికి ఆ మెసేజ్ వారి చాట్ లో డిలీట్ అవతుంది.. ఇప్పటికే ఈ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ మెసెంజర్లలో అందుబాటులో ఉంది.