పిజ్జా అంటే చాలా మందికి ఇష్టం పిల్లలు కూడా దీనిని చాలా ఇంట్రస్ట్ గా తింటారు, అయితే పిజ్జా ఇప్పటిది కాదు ఏనాటి నుంచో ఉన్న పురాతన ఫుడ్ అంటారు ఫుడ్ లవర్స్, ఎందుకు అంటే దీని చరిత్ర తెలుసుకుంటే నిజం అనిపిస్తుంది.
ప్రపంచంలో తొలిసారి పిజ్జా తయారైంది క్రీస్తు పూర్వం 997 సంవత్సరంలో.
ఎక్కడ అనుకుంటున్నారా, ఇటలీలోని గేటా నగరంలో మొదటిసారి పిజ్జాను తయారు చేశారు. అక్కడ నుంచి ఇది అందరికి నచ్చిన మెచ్చిన ఫుడ్ అయి దేశం అంతా పాకింది… దీనిని ముందు ఆలీవ్ ఆయిల్ మసాలాలతో తయారు చేసేవారు..
18వ శతాబ్దం నుంచి ఇటీలియన్లు పిజ్జాల్లో టమోటాలు కూరలు యాడ్ చేశారు.
ఇటలీలోని పేద వారు వేసవిలో పుచ్చకాయలు శీతకాలంలో పిజ్జాలు తినేవారని చరిత్ర చెబుతోంది.1933లో ప్యాస్టీ లన్సెరీ అనే వ్యక్తి న్యూయార్క్లో పాస్టీస్ పిజేరియా అనే రెస్టారెంట్ నుంచి పిజ్జాలు అమ్మడం స్టార్ట్ చేశాడు.. ఇప్పుడు ఇలా ప్రపంచం అంతా అమ్మకం జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలని పిజ్జా మంత్ అంటారు ఇలా 1984లో పేరు పెట్టారు.